రాయచూరు రూరల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి సమయంలో లారీ ప్రమాదంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ఘటన సింధనూరు పీడబ్ల్యుడీ క్యాంప్ డాలర్స్ కాలనీ వద్ద జరిగింది.
వివరాలు... జవళగెరె నీటిపారుదల విభాగంలో జూనియర్ ఇంజనీర్లు శివరాజ్ రాంపూరే (28), మల్లికార్జున సర్జాపూర (29) డాటా ఎంట్రీ ఆపరేటర్ మెహబూబ్ (30). వీరందరూ సింధనూరులోనే నివాసం ఉంటారు. జవళగెరె ఆఫీసు నుంచి వచ్చి, డాలర్స్ కాలనీ వద్ద ద్విచక్ర వాహనాలు నిలిపి మాట్లాడుతుండగా వరిపొట్టు లారీ అతి వేగంగా వచ్చి బోల్తా పడటంతో ముగ్గురిపై వరి పొట్టు బస్తాలు మీదపడ్డాయి. అందులో చిక్కుకుని ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ ఎస్‌ఐ వెంకటేశ్ ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు కాగా, బళ్లారికి తరలించారు. జేసీబీ ద్వారా వరిపొట్టు బస్తాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. మంగళవారం పోస్టుమార్టం జరిపి కుటుంబాలకు అప్పగించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పలు కుటుంబాలలో తీరని విషాదం నింపింది.
Comments
Please login to add a commentAdd a comment