చెట్ల నేస్తం తుళసీగౌడ
శివాజీనగర: వృక్షమాతగా పేరు గాంచిన తుళసిగౌడ మృతికి విధానసభలో మంగళవారం అన్ని పార్టీల సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ యూ.టీ.ఖాదర్, వృక్షమాతగా పేరు గాంచిన తుళసిగౌడ మరణాన్ని ప్రస్తావించారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హొన్నహళ్ళికి చెందిన తుళసిగౌడ హాలక్కి బుడకట్టు సముదాయపు పేద కుటుంబంలో జన్మించగా, పర్యావరణంపై గాఢమైన ఆసక్తి కలిగి ఉన్నారు. మొక్కలు, చెట్లతో అనుబంధం, అపారమైన జ్ఞానం కలిగిన ఉన్న ఆమె, అడవిలో ఎన్‌సైక్లోపీడియాగా ప్రఖ్యాతి పొందారని చెప్పారు. 300 రకాలకు పైగా చెట్ల గురించి ఆమెకు సంపూర్ణంగా తెలుసని అన్నారు. బాల్యంలోనే వితంతువైన తుళసీగౌడ చెట్లనే కుటుంబం, పిల్లలుగా చూసేవారు. ఒకప్పుడు అడవి నుండి కట్టెలు తీసుకొచ్చే ఆమె నేడు అడవినే నిర్మించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పద్మశ్రీ, రాజ్యోత్సవ అవార్డు, ప్రియదర్శిని, వృక్షమిత్రతో పాటుగా పలు ప్రశస్తులు ఆమె వశమయ్యాయి. ఆమె మరణం విషాదకరమని సంతాపం తెలిపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు. అందరూ ఒక నిమిషం మౌనం పాటించారు.
విధానసభలో ఘన నివాళులు
Comments
Please login to add a commentAdd a comment