అంబారీపై హనుమాన్
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని సబ్మంగళ గ్రామంలో పంచముఖి వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలు సందర్భంగా జాతర వేడుక నిర్వహించారు. కళా బృందాల ప్రదర్శనలు, వేలాదిమంది భక్తుల సమక్షంలో ఏనుగు అంబారీపై హనుమంతున్ని ఊరేగించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తజనం తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయం ముందున్న 32 అడుగుల పంచముఖి ఆంజనేయస్వామి మూర్తికి పూజలు చేశారు.
అంబారీ వేడుక (ఇన్సెట్లో)
స్వామివారి మూల విరాట్టు
Comments
Please login to add a commentAdd a comment