అందరికీ ఆదర్శం బాబర్ అలీ
రాయచూరు రూరల్: సమాజ ప్రగతికి విద్యా రంగమే పునాది. విద్యారంగం ఎంతగా బలోపేతం అయితే దేశ భవిష్యత్ అంత బాగుంటుందని భావించిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబర్ అలీ పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ముషీరాబాద్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాబర్ అలీ 22 ఏళ్ల వయసులో 8 వేల మందికి విద్యాదానం చేశారు. విద్యకు దూరం కాకూడదని, ప్రతి ఒక్కరూ విద్య నేర్చుకోవాలని తపన కలిగి ఉండాలన్నారు. పేదరికం వల్ల పిల్లలు బడికి వెళ్లరనే మాటను పక్కన పెట్టి తల్లిదండ్రులు ఒప్పించి విద్యాబుద్ధులు నేర్పించిన బాబర్ రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఇటీవల ఆయన కర్ణాటకలోని రాయచూరు, గుల్బర్గా ప్రాంతాల్లో పర్యటించి విద్యా బోధనపై ఇక్కడి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. దేశ నిర్మాణానికి, విద్యావంతులతో మెరుగైన పురోగతి సాధ్యమని, విద్యను ఉచితంగా బోధించాలని సూచనలు చేశారు.
చిన్నవయసులోనే పురస్కారాలు:
16వ ఏట బీబీసీ పరీక్షలో ఉత్తీర్ణుడై ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా నియమితులయ్యారు. కుల, మత, వర్గ ప్రాంత బేధాలు లేకుండా అందరికీ సమానంగా విద్యను బోధించాలనే ధృడ సంకల్పాన్ని పొందారు. 2013లో ఆంగ్ల భాషలో డిగ్రీ, 2017లో పీజీ పూర్తి చేశారు. సీఎన్‌ఎన్, ఐపీఎన్ నుంచి 2009లో రియల్ హీరో అవార్డు, బీబీసీలో యువ ప్రధానోపాధ్యాయుడి అవార్డు, 2010లో ఎన్‌డీటీవీ ఇండియా ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2017లో గ్లోబల్ ఎడ్యుకేషన్ అవార్డు, 2018లో ఐసీడీఎస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషన్ ఆఫ్ ది హీరో అవార్డు అందుకున్నారు.
పేద విద్యార్థులకు విద్యాదానం
8 వేల మందికి అక్షర జ్ఞానం
పశ్చిమ బెంగాల్ ప్రధానోపాధ్యాయుడి విద్యా ప్రగతి
రాష్ట్రాల్లో ఉపాధ్యాయులతో సమావేశాలు
Comments
Please login to add a commentAdd a comment