లాఠీచార్జ్‌పై హైకోర్టులో రిట్
హుబ్లీ: పంచమసాలీలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి సంబంధించి ధార్వాడ హైకోర్టులో రిట్ దాఖలు చేసినట్లు ఆ సమాజం పీఠాధిపతి మృత్యుంజయస్వామి తెలిపారు. శనివారం ఆయన ధార్వాడలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల కోసం బెళగావి సువర్ణసౌధ ఎదుట ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారని, ఈ విషయంపై కోర్టులో రిట్ దాఖలు చేయడంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖకు ఏకసభ్య పీఠం నోటీసులు జారీ చేసిందన్నారు. కూడల సంఘమ లింగాయత్ పంచమశాలి పీఠం, బసవజయ మృత్యుంయస్వామి, పంచమశాలి న్యాయవాదుల పరిషత్తుతో కలిపి రిట్ దాఖలు చేశామన్నారు. 12 మందిపై కేసులు పెట్టారు. ఆ కేసులను రద్దు చేయాలని, సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశామని, అయితే సీఎం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామన్నారు. సోమవారం గాయపడిన వారిని పరామర్శిస్తామన్నారు. లాయర్ పూజా సౌదత్తి మాట్లాడుతూ...ఆందోళన వేళ 144 సెక్షన్ జారీ కాలేదు. నేరుగా లాఠీచార్జ్ చేశారన్నారు. వీటిని ప్రశ్నిస్తూ కోర్టులో రిట్ వేశామన్నారు. మరో న్యాయవాది ప్రభులింగనావదగి మాట్లాడుతూ...కేసు నమోదైన వెంటనే విచారణ చేపట్టి నోటీసు జారీ చేయాలని ఆదేశించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment