ఆన్‌లైన్ జూదం.. ప్రాణాంతకం
ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, రమ్మీ జూదాలు యువతను బానిసలు చేసుకుని నిర్వీర్యం చేస్తున్నాయి. పది, ఇరవై రూపాయలు పెట్టి ఆడితే లాభం వస్తుంది, ఆశపడి ఎక్కువ మొత్తం ఫణం పెడితే అంతా పోతుంది అనే సూత్రంతో జూదాల్లో మోసం సాగుతుంది. వాటిలో మోసపోయినవారు అనుభవసారంతో చెప్పే మాట ఇది. ఈ బెట్టింగ్‌లతో సర్వం కోల్పోయి ఒకేరోజు ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు.
దొడ్డబళ్లాపురం: ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన యువకుడు అప్పులపాలై ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ దుర్ఘటన బీదర్ జిల్లా భాల్కి తాలూకా జ్యోతి తాండాలో చోటుచేసుకుంది. గ్రామ నివాసి విజయ్‌కుమార్ (25).. కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన విజయ్‌కుమార్ నిరంతరం జూదమాడుతూ గడిపేవాడు. జూదాల కోసం రూ.12 లక్షలు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక, రుణదాతల వేధింపులను తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బెట్టింగ్ బానిసై నదిలోకి దూకాడు
యశవంతపుర: ఆన్‌లైన్‌లో జూదాలాడుతూ డబ్బు పోగొట్టుకున్న యువకుడు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన దక్షిణకన్నడ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది. మంగళూరు మూడశెడ్డ గ్రామానికి చెందిన సూర్య శెట్టి (23) ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేవాడు. పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో సూర్య సమీపంలోని నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మంగళూరు నగర పోలీసులు కేసు నమోదు చేశారు.
కానుకలంటూ వైద్యురాలికి టోపీ
మైసూరు: గుర్తు తెలియని వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్‌లో వచ్చిన సందేశం చూసి ఓ వైద్యురాలు అతని మాటలను నమ్మి రూ.9.21 లక్షలను కోల్పోయిన ఘటన నగరంలో జరిగింది. మైసూరు విద్యానగర నివాసురాలైన మహిళకు ఓ వ్యక్తి మెసేజ్ పంపించాడు. తనది లండన్ అని మాటలు కలిపాడు. దీంతో ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. కొన్ని రోజుల తర్వాత నీకు లండన్ నుంచి విలువైన కానుకను పంపుతానని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మీకు కానుకలు వచ్చాయి, కస్టమ్స్ పన్నులు చెల్లించాలని రూ.9,21,174లను తన ఖాతాకు బదలాయించుకున్నాడు. కానుకల కోసం వేచిచూసిన వైద్యురాలికి నిరాశే మిగిలింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
తీవ్రంగా నష్టపోయి ఇద్దరు
యువకుల ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment