కాల భైరవ ఊరేగింపు
విజయపుర (బెంగళూరు గ్రామీణ): విజయపుర పట్టణంలో ఉన్న నవగ్రహ దేవాలయం సర్కిల్‌లో ప్రసిద్ధి చెందిన శ్రీకాల భైరవేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకారం చేసి ట్రాక్టర్‌లో ఊరేగింపు జరిపారు.
కాంట్రాక్టరు కుటుంబానికి పరిహారం: మంత్రి
యశవంతపుర: ఇటీవల బీదర్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ సచిన్ పాంచాళ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె తెలిపారు. ఆయన ఆదివారం బీదర్‌లో విలేకరులతో మాట్లాడారు. సచిన్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో సచిన్ కుటుంబానికి పరిహారాన్ని అందజేస్తామన్నారు.
కారును ఢీకొన్న బస్సు..
ఇద్దరు యువకుల మృతి
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకా ఆనందపుర మురుఘ మఠం దగ్గర కారును ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. దొడ్డబళ్ళాపురకు చెందిన శరణ్ (23), అక్షయ్ (24) మృతులు. రిపేరి అయిన వాహనాన్ని తీసుకురావాలని ఇద్దరూ కలిసి ఎర్టిగా కారులో దొడ్డబళ్ళాపుర నుంచి హొన్నావరకు వెళుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున సాగర నుంచి శివమొగ్గ నగరానికి వెళుతున్న బస్సు వీరి కారును ఢీనింది. కారు తీవ్రంగా దెబ్బతినగా, ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఆనందపురం పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
స్కూటర్‌కు లారీ ఢీ, ఒకరు మృతి
మైసూరు: వేగంగా వచ్చిన లారీ.. స్కూటర్‌ను ఢీకొనగా ఒకరు మరణించిన ఘటన మైసూరులోని గద్దిగె మెయిన్ రోడ్డు మారెగౌడనహళ్ళి గేట్ వద్ద జరిగింది. హెచ్‌డి కోటె తాలూకాకు చెందిన సతీష్ (27), మేనల్లుడు శివు (13)ని తీసుకుని స్కూటర్‌లో మైసూరు నుంచి స్వగ్రామానికి బయల్దేరాడు. రోడ్డు రోలర్‌ను తీసుకొస్తున్న లారీ.. మూల మలుపు వద్ద వారి స్కూటర్‌ని ఢీకొట్టింది. తీవ్రగాయాలైన ఆయిన సతీష్ అక్కడే చనిపోగా, గాయపడిన శివును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్కూటర్ నుజ్జునుజ్జు కాగా, రోడ్డు రోలర్ లారీ నుంచి పడిపోయింది, జయపుర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment