సిలికాన్ సిటీ కళకళ
బనశంకరి: న్యూ ఇయర్ –2024 స్వాగతానికి సిలికాన్‌సిటీ సన్నద్ధమైంది. వేడుకలు ఎక్కువగా జరిగే ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, చర్చ్ స్ట్రీట్ తదితర రోడ్లలో సీసీ కెమెరాల అమరిక, వాచ్‌టవర్, ఉమెన్స్ సేఫ్టీ ల్యాండ్ తదితరాల నిర్మాణం ఊపందుకుంది. అదనంగా 400 కెమెరాలను అమరుస్తారు. ప్రత్యేకంగా కేంద్ర భాగంలోని బ్రిగేడ్ రోడ్డు, ఎంజీరోడ్డు, ఒపేరా జంక్షన్, రెసిడెన్సీరోడ్డు మొదలైన ప్రదేశాల్లో ఎక్కువమంది పోలీసులను నియమించి, ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక బ్రిగేడ్ రోడ్డులో ఆదివారం సాయంత్రం నుంచి విద్యుద్దీపాలంకరణ మొదలైంది.
అల్లర్లకు దిగితే కఠిన చర్యలు: డీసీఎం
న్యూ ఇయర్ సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హెచ్చరించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించామన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు ఆచరించడం లేదని, ప్రైవేటు కార్యక్రమాల్లో మేము జోక్యం చేసుకోలేమని అన్నారు. నగరవ్యాప్తంగా 10 వేలకు పైగా సీసీ కెమెరాలు అమర్చామని నిఘా పెట్టామమన్నారు. అల్లర్లకు దిగితే కఠినచర్యలు తప్పవన్నారు. ప్రజలు బెంగళూరు గౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు.
అప్పుడే న్యూ ఇయర్ వెలుగులు
భద్రతా చర్యలు ముమ్మరం
Comments
Please login to add a commentAdd a comment