కట్టుదిట్టంగా కేపీఎస్‌సీ పరీక్ష
శివాజీనగర: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్‌సీ) 384 గెజిటెడ్ ఉద్యోగాల నియామకాల కోసం రాత పరీక్షలు నిర్వహిస్తోంది. ఆదివారం రాష్ట్రంలో 552 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. మొత్తం 2.109 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు పేరు నమోదు చేసుకొన్నారు. దివ్యాంగులను మినహాయించి సాధారణ అభ్యర్థులకు పొరుగు జిల్లాల పరీక్షా కేంద్రాలకు కేటాయించారు. మొబైల్‌ఫోన్, స్మార్ట్ వాచ్ సహా అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులను పరీక్షా కేంద్రానికి తీసుకురాకూడదని ఆదేశించారు. అలాగే ఫుల్ షర్ట్‌లను ధరించరాదని హాల్‌టికెట్‌లో పేర్కొన్నారు.
ఆగస్టు నాటి పరీక్ష మళ్లీ..
ఆగస్టు 27న జరిగిన కన్నడ ప్రిలిమ్స్ పరీక్షలో ఆంగ్ల అనువాదంలో అనేక తప్పులు దొర్లాయి. దీంతో అభ్యర్థులు, సాహితీవేత్తలు, కన్నడ పోరాటదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పునః పరీక్షకు డిమాండ్ చేశారు. దీంతో ఆ పరీక్షను ఆదివారం మళ్లీ నిర్వహించారు. పరీక్షా కేంద్రాలకు గంట అర్ధగంట ముందుగానే చేరుకన్న అభ్యర్థులు పుస్తకాలు చదువుతూ కనిపించారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి, ఫోటో తీసుకుని లోపలికి అనుమతించారు. లీకేజీ, కాపీయింగ్ వంటి సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్త్ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment