మంటల్లో ఇన్నోవేషన్ సెంటర్
దొడ్డబళ్లాపురం: ఐటీ, బీటీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న బెంగళూరులోని బయో ఇన్నోవేషన్ సెంటర్ (బీబీసీ)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎలెక్ట్రానిక్ సిటీలోని బీహెచ్‌ఎల్ సెంటర్‌లో ఉన్న ఈ సంస్థలో మంగళవారంనాడు తెల్లవారుజామున 5 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విలువైన ఉపకరణాలు బూడిద కావడంతో రూ.150 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ ల్యాబ్‌లో కెమికల్స్, పరికరాలు ఎక్కువగా ఉండడం వల్ల మంటలు త్వరగా చెలరేగాయి. మండే గుణంఉన్న రసాయనాల వల్ల లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు ఫైరింజన్లలో వచ్చి అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎలక్ట్రాని సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏమిటీ బీబీసీ?
ఇన్నోవేషన్ సెంటర్‌లో పెద్దసంఖ్యలో ఐటీ, బీటీ సంస్థలు, స్టార్టప్ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 45 కంపెనీలు ఉన్నట్లు సమాచారం. 500 మందికిపైగా నిపుణులు పనిచేస్తున్నారు. ప్రధానంగా బయో టెక్నాలజీలో నూతన ఉత్పత్తుల గురించి ఇక్కడ పరిశోధనలు జరుగుతుంటాయి. వ్యవసాయ రంగం, నూతన వంగడాల గురించి కూడా పరిశోధనలు జరుగుతుంటాయి.
రూ.150 కోట్ల ఆస్తి నష్టం!
బెంగళూరులో సంఘటన
Comments
Please login to add a commentAdd a comment