గో దారుణంపై కన్నెర్ర
సాక్షి బళ్లారి: బెంగళూరులో గోవులపై జరుగుతున్న దారుణాన్ని ఖండిస్తూ నగరంలో బుధవారం జిల్లా బీజేపీ రైతు మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చామరాజపేటె నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జమీర్ అహమ్మద్ ప్రోద్బలంతోనే గోవులను దారుణంగా చంపుతున్నారన్నారు. అలాంటి మంత్రి బళ్లారి జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా కొనసాగుతుండటం బాధాకరం అన్నారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గోవులకు పూజ చేసి రాయల్ సర్కిల్‌లో నిరసన వ్యక్తం చేశారు. గోవులపై కక్షగట్టిన మంత్రి జిల్లా ఇన్‌చార్జ్‌గా ఉండటం దౌర్భాగ్యం అన్నారు. తక్షణం ఆయన తన పదవికి రాజీనామా చేయాలని లేదా పార్టీ అధిష్టానం అతనిని మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. ఈ దారుణాలను ఆపకుంటే భారీ ఆందోళనలు చేపడతామన్నారు. బీజేపీ రైతు మోర్చా అధ్యక్షుడు గణపాల ఐనాథ్‌రెడ్డి, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీప్రసాద్, బీజేపీ నాయకులు, మహిళా మోర్చా పదాధికారులు పాల్గొన్నారు.
దుండగులపై చర్యలు చేపట్టాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పాలిచ్చే గోమాత పొదుగులను కత్తిరించిన వారిపై చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ పాటిల్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోనిన బసవేశ్వర సర్కిల్ నుంచి మంత్రి బోసురాజు కార్యాలయం మీదుగా గోశాల వరకు ర్యాలీ ద్వారా ఆందోళన చేపట్టి మాట్లాడారు. కాంగ్రెస్ సర్కా ర్ గోవుల రక్షణలో విఫలమైందన్నారు. దుండగులను కఠినంగా శిక్షించాలని ఒత్తిడి చేశారు. ఆందోళనలో శరణమ్మ, సుమ, జయశ్రీ,, సుమతీ, రాఘవేంద్ర, రామచంద్ర, నాగరాజ్, యల్లప్ప, శరణ బసవలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment