సంఘ విద్రోహులపై ఉక్కుపాదం
హుబ్లీ: జంట నగరాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు, ఘోరాల్లో నిమగ్నులైన 45 మంది రౌడీ షీటర్లను జిల్లా నుంచి బహిష్కరించినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడారు. సదరు రౌడీషీటర్లపై వివిధ పోలీస్ స్టేషన్లలో కొన్ని కేసులు నమోదయ్యాయన్నారు. ఆ మేరకు హత్యలు, దోపిడీలు, మత్తు మందుల విక్రయాలు, సేవనం, మట్కా, భూమాఫియా తదితర కేసుల్లో పాలు పంచుకున్న రౌడీషీటర్ల నుంచి సమాజంలో శాంతికి భంగం కలిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. నిందితులను బీదర్, యాదగిరి, దక్షిణ కన్నడ, చామరాజనగరకు బహిష్కరించామన్నారు. అంతేగాక వీరి కార్యకలాపాలపై కూడా తీవ్రమైన నిఘా వహించామన్నారు. ధార్వాడ పోలీస్ స్టేషన్‌లో 7, ఉపనగర్ పోలీస్ స్టేషన్‌లో 3, విద్యాగిరిలో 7తో పాటు ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 17 మందిని బహిష్కరించామన్నారు. అలాగే హుబ్లీ నగర టౌన్ స్టేషన్ పరిధిలో 1, ఉపనగర స్టేషన్ పరిధిలో 1, కమరిపేట పోలీస్ స్టేషన్‌లో 2, బెండిగేరి స్టేషన్‌లో 3, కసబాపేట పోలీస్ స్టేషన్‌లో 9, అశోక్ నగర్ స్టేషన్‌లో 2, విద్యానగర్‌లో 1, ఏపీఎంసీ నవనగర్ పోలీస్ స్టేషన్‌లో 4, అలాగే కేశ్వాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో 5 మంది కలిపి హుబ్లీ నగర పరిధిలో మొత్తం 28 మంది రౌడీషీటర్లను సరిహద్దుల నుంచి బహిష్కరించామన్నారు. ఒక వేళ వీరు సదరు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
45 మంది రౌడీల జిల్లా బహిష్కరణ
నగర పోలీస్ కమిషనర్ శశికుమార్
Comments
Please login to add a commentAdd a comment