స్వామియే శరణం అయ్యప్ప
హొసపేటె: మకర సంక్రాంతి సందర్భంగా నెహ్రు కాలనీలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శబరిమలలో మకరజ్యోతి దర్శనం నేపథ్యంలో అయ్యప్ప ఆలయంలో పలు పూజ కై ంకర్యాలు నిర్వహించారు. పంచామృత అభిషేకం, నెయ్యి అభిషేకం, భస్మాభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. శబరిమలైలో జ్యోతి దర్శనం చేసుకున్నట్టుగానే మణికంఠ స్వామికి మహామంగళ హారతి పారాయణం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దీపారాధన నిర్వహించారు. ఉదయం నుంచి అయ్యప్ప భక్తులు క్యూలైన్లలో నిల్చుని స్వామివారిని దర్శించుకున్నారు. ఫల పుష్ప నైవేద్యాలతో పూజలు చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శంకర్ ఎన్.నంబూద్రి, అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్టు అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, కార్యదర్శి గణపతి స్వామి, ప్రహ్లాద్ భూపాల్, ఉపాఽధ్యక్షుడు డీ.వెంకటేష్, కోశాధికారి రవీంద్రనాథ్ గుప్తా, డైరెక్టర్లు మహంతేష్, శివకుమార్, రాజేష్, ప్రసన్నలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు
Comments
Please login to add a commentAdd a comment