పిల్లలకు విలువలను నేర్పించాలి
హుబ్లీ: పిల్లలకు చదువుకునేటప్పుడే తల్లిదండ్రులు తీరిక చేసుకొని సాంస్కృతిక విలువలను నేర్పించాలని స్వర్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ, స్వామి వివేకానంద పాఠశాల డైరెక్టర్, ప్రవాసాంధ్ర ప్రముఖుడు డాక్టర్ సీహెచ్ వీఎస్‌వీ ప్రసాద్ పిలుపునిచ్చారు. బైరదేవరకొప్పలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇచ్చే సాంస్కృతిక, నైతిక విలువలను విద్యార్థులు తమ జీవితంలో అలవరుచుకొని దేశ ప్రగతికి కారకులు కావాలని సలహా ఇచ్చారు. విద్యార్థులు తమ సమయాన్ని బోధన, మనో వికాసం, ఉత్తమ భవిత, నిర్మాణ దిశగా ఉన్నతంగా వినియోగించుకోవడానికి ప్రేరితులు కావాలన్నారు. అధ్యయనం, అభిరుచులు, విశ్రాంతి సమయాలను సమతుల్యత సాధించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ తరగతి గదులలో ఉపాధ్యాయులు బోధించే పాఠశాలను ఆసక్తితో నేర్చుకొనేలా ప్రేరేపించడంతో తల్లిదండ్రులు తమ ఇళ్లల్లో సమయాన్ని కేటాయించడం చాలా అవసరం అన్నారు. రాజశేఖర్ మెణసినకాయి తదితరులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి సానిధ్యం వహించిన మనగుండి బసవానంద స్వామీజీ పిల్లలకు నైసర్గిక జీవితాన్ని ప్రేమించేలా బోధించాలని సూచించారు. బీఈఓ ఉమేష్, ప్రిన్సిపాల్, పాలనాధికారిణి శర్మిల హొసూరు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment