నాతోనే కాపురం చేయాలన్నందుకు.. ●
● మొదటి భార్యను చంపిన భర్త
సాక్షి,బళ్లారి: మొదటి భార్య బతికి ఉండగానే ఆమెకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుని మొదటి భార్యతో కొన్ని రోజులు, రెండో భార్యతో మరికొన్ని రోజులు కాపురం చేస్తున్న భర్తతో రెండో భార్యను వదిలిపెట్టి తనతోనే కాపురం చేయాలని మొదటి భార్య ఒత్తిడి చేయడంతో మొదటి భార్యను భర్తే హత్య చేసిన ఉదంతం ఇది. బెళగావి జిల్లా సవదత్తి తాలూకా ఇంచల గ్రామానికి చెందిన శమా రియాజ్ పఠాన్(25)ను ఆమె భర్త రియాజ్ పఠాన్ దారుణంగా హత్య చేశాడు. పదేళ్ల పాటు కలిసి మెలిసి జీవిస్తున్న తరుణంలో రెండో పెళ్లి చేసుకున్న రియాజ్ అనూహ్యంగా మార్పు చెంది, రెండో భార్య మోజులో పడి మొదటి భార్యను వదిలించుకునేందుకు పథకం ప్రకారం ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment