సాక్షి బళ్లారి: ముక్కుపచ్చలారని ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి పరారైన కామాంధునిపై పోలీసుల తుపాకీ పేలింది. రెండు రోజుల క్రితం విజయనగర జిల్లాలోని తోరణగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కమలాపుర సమీపంలోని హలేబీడుకు చెందిన మంజునాథ్ (26) నిందితునిగా గుర్తించి గాలింపు సాగించారు.
కొప్పళ జిల్లా హులిగి సమీపంలో మంజునాథ్‌ను పోలీసులు పట్టుకొన్నారు. ఈ సమయంలో నిందితుడు దాడి చేసి తప్పించుకోవడానికి యత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో మంజునాథ్ కాలికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ శోభారాణి తదితరులు గాయపడిన నిందితుడిని ఆస్పత్రిలో పరిశీలించారు. నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment