నమో వందే వాల్మీకి
బనశంకరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్యాననగరి లాల్‌బాగ్‌లో ఫల పుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. రామాయణ కావ్య రచయిత, ఆది కవి మహర్షి వాల్మీకి థీమ్ తో కూడిన ఫ్లవర్ షోను గురువారం సీఎం సిద్దరామయ్య ఆరంభించారు. 27వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగుతుంది. ఈ వేడుకలో పలువురు వాల్మీకి వర్గం స్వామీజీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సందర్శకులు పుష్ప రాశులను వీక్షించారు.
లక్షలాది పూలతో అలంకారం
లాల్‌బాగ్ గ్లాజ్ హౌస్‌లో 1.5 లక్షల డచ్ గులాబీలు, 400 కిలోల పించ్డ్ గులాబీ, 300 కేజీల సేవంతి పుష్పాలతో వాల్మీకి థీమ్‌ను తీర్చిదిద్దారు. మహర్షి వాల్మీకి విగ్రహం, రామాయణ ఘట్టాలను సుందరంగా తీర్చిదిద్దారు. హనుమ–జాంబవంత, జటాయువు కళాకృతులు ఆకట్టుకుంటాయి. 18 నుంచి కూరగాయల ఆకృతులు, పుష్పబారతి, బోన్సాయ్, డచ్ పూల అమరిక, థాయ్ ఆర్ట్స్, జానూరుకళ ప్రదర్శనను మొదలవుతుంది. సందర్శించే పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.30 టికెట్ కొనాలి. స్కూలు యూనిఫాంతో వచ్చే బాలలకు ఉచితం. వాహనదారులు నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలి.
లాల్‌బాగ్‌లో గణతంత్ర ఫ్లవర్ షో
వాల్మీకి, రామాయణం థీమ్
పుష్పరాశులతో వర్ణమయం
Comments
Please login to add a commentAdd a comment