మరో లవ్–ధోకా.. ప్రియుడు ఆత్మహత్య
యశవంతపుర: రాష్ట్రంలో లవ్– ధోకా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న విభేదాలకే మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా ప్రియురాలితో గొడవ పడిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగలకోట జిల్లా బీళగి తాలూకా నింగాపుర గ్రామంలో జరిగింది. నింగాపురకు చెందిన అజయ్ (24) ప్రియురాలు అనుతో కలిసి స్నేహితుడు నవీన్ ఊరు నింగాపురకు వెళ్లాడు. అక్కడ అజయ్ మద్యం తాగాడు. దీనిపై ప్రియురాలు ఆక్రోశం వ్యక్తం చేసింది. నేను ఊరికి వెళ్లిపోతానంటూ నవీన్‌తో కలిసి బయల్దేరింది. వద్దని వారించినా ఆమె వినలేదు. దీంతో ఉరి వేసుకొని చనిపోతానంటూ అజయ్ ఆమెకు వీడియోకాల్ చేసి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొన్నాడు. వాపస్ వచ్చి చూడగా ఉరికి వేలాడుతున్న అతన్ని దించి ఆస్పత్రి తరలిస్తుండగా చనిపోయాడు. నవీన్ నమ్మకద్రోహం చేశాడని అజయ్ ఆరోపణలు చేసినట్లు తెలిసింది. వారు మృతదేహాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. బీళగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మారని నడత.. భార్య హత్య
మైసూరు: భార్య ప్రవర్తనతో విసుగు చెందిన భర్త ఆమె గొంతు కోసి చంపి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన ఘటన జిల్లాలోని హెచ్‌డీ కోటె తాలూకా కణియన హుండి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మేనత్త కొడుకు దేవరాజ్‌తో కుట్టవాడి బసవాళ గ్రామానికి చెందిన తేజస్విని (25)నికి ఏడేళ్ల క్రితం దేవరాజ్‌తో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెలన్నర క్రితం తేజస్విని తమ సొంత ఊరుకు చెందిన దర్శన్‌గౌడ అనే యువకునితో కలిసి పారిపోయింది. భర్త పోలీసులకు భార్య మిస్సింగ్ అని ఫిర్యాదు చేశాడు. బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకుని పిలుచుకొచ్చి కొన్ని రోజుల పాటు ఆమె పుట్టింట్లో వదిలాడు. తర్వాత పుట్టింటివారు నచ్చజెప్పి భర్తతో కణియనహుండి గ్రామంలోని తోటలోని ఇంటికి పంపించారు. అయినా ఆమె తీరు మారకపోవడంతో విసుగు చెందిన దేవరాజ్ ఇంటి వెనుకకు పిలుచుకెళ్లి ఆమె గొంతు కోసి చంపి, హంపాపుర ఉప పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment