అవ్వకు ఆసరా ఇవ్వరూ
శివమొగ్గ: మహిళల రక్షణకు చాలా చట్టాలున్నాయి. అసహాయ, నిర్గతిక మహిళలకు సంక్షేమం పేరిట ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. మహిళల రక్షణ కోసమే పలు సంఘ సంస్థలు కూడా పని చేస్తున్నాయి. అయితే నగరంలోని రోడ్లలో, వీధుల్లో భిక్షాటన చేసి దుర్భర జీవితం గడుపుతున్న అసహాయక మహిళల సంరక్షణ ఎవరికీ పట్టడం లేదు. నగరంలోని ప్రైవేట్, ఆర్టీసీ బస్టాండ్లతో పాటు పలు చోట్ల అసహాయక వృద్ధులు యాచనతో జీవితం గడుపుతున్నారు. వీరిలో కొందరు పలు రకాల వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. అయితే ఇలాంటి మహిళలకు సహాయపడే కనీస మానవత, చిత్తశుద్ధి సంబంధిత శాఖల అధికారులు ప్రదర్శించడం లేదు. నిర్భాగ్యులు అలాగే ఎండా వాన చలి తేడా లేకుండా దయనీయ జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల కొందరు అసహాయక మహిళలు భిక్షాటన చేస్తున్నా సంబంధిత శాఖల అధికారులు ఇలాంటి వారికి తగిన పునర్వసతి సౌకర్యం కల్పించే దిశగా దృష్టి సారించడం లేదు. ఇటువంటివారి కోసం శరణాయాలను ఏర్పాటు చేసి సంరక్షించాలని స్థానికులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment