యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రాయచూరు రూరల్: జిల్లాలో కృష్ణా నదీ తీర గ్రామాల నుంచి ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రాయచూరు, యాదగిరి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక రవాణా మూడు పువ్వలు, ఆరు కాయలుగా నడుస్తోంది. వర్షాభావంతో రైతులు, పశువులకు మేత లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దర్జాగా టిప్పర్ల ద్వారా రాత్రికి రాత్రే ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఇసుక తరలించే వాహనాలు ఎక్కువగా నడుస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై పోలీస్, రెవెన్యూ, ఆర్‌టీఓ శాఖల అధికారులు మౌనం వహిస్తున్నారు. నారాయణపుర జలాశయం కింది భాగంలో జేసీబీలు, హిటాచీలతో ట్రాక్టర్లు, టిప్పర్లలోకి ఇసుకను నింపుతున్నారు. యాదగిరి జిల్లాలోని వడగేర, సురపుర, భీమరాయన గుడి, శహాపుర, రాయచూరు జిల్లాలోని దేవదుర్గ, గూగల్, గుర్జాపూర్‌లతో పాటు తెలంగాణలోని జూరాలలో చెక్‌పోస్టులున్నా తమ కళ్లుగప్పి తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాకు అధికారులు బ్రేక్‌లు వేయలేక పోతున్నారు.
రోజుకు రూ.2 కోట్ల మేర లావాదేవీలు
హైదరాబాద్, మహారాష్ట్రలోని సోలాపూర్, సాంగ్లీ, మీరజ్ వరకు అక్రమ రవాణా కొనసాగుతోంది. ఒక టిప్పర్‌కు రూ.55–60 వేలు, కలబుర్గి జిల్లాలో రూ.80 వేలు, ఇతర రాష్ట్రాలకు రూ.1.50 లక్షల వరకు ధరతో ఇసుక సరఫరా చేస్తున్నారు. ప్రతి నిత్యం 400 టిప్పర్ల మేర రవాణా సాగుతోంది. ప్రతి టిప్పర్‌లో 35 టన్నుల మేర ఇసుక రవాణా చేస్తారు. రోజుకు రూ.2కోట్ల మేర వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయని సమాచారం. యాదగిరి జిల్లా ఇంచార్జి మంత్రి శరణ బసప్ప దర్శనాపుర, దేవదుర్గ ఎమ్మెల్యే కరెమ్మ నాయక్‌ల నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా ఇసుక వాహనాల సంచారం అధికమైంది. కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాధికారులు, ఎస్పీలు మౌనం వహించడంపై ప్రజలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రికి రాత్రే సరిహద్దులు
దాటుతున్న వైనం
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న
యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment