నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందించండి
కోలారు: నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందించాలని రైతులకు విధాన పరిషత్ సభ్యుడు ఇంచర గోవిందరాజులు పిలుపునిచ్చారు. నగరంలోని ఉద్యానవన(హార్టికల్చర్) శాఖ కార్యాలయ మైదానంలో వ్యవసాయ, హర్టికల్చర్ శాఖలు గురువారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఫలపుష్ప ప్రదర్శన, సిరిధాన్యాలు, సేంద్రీయ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే నాణ్యమైన ఆహార ఉత్పత్తులతోనే సాధ్యమన్నారు. రసాయనాలు తగ్గించి సేంద్రీయ ఎరువులు వినియోగించాలన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో పలువురు రైతులకు అత్యంత శ్రేష్ట కృషిక్ అవార్డులను అందించి సన్మానించారు. వ్యవసాయ పరికరాలు, పంటల సాగుపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నగరసభ అధ్యక్షురాలు కే.లక్ష్మీదేవమ్మ, జిల్లా గ్యారంటీ పథకాల అమలు సమితి అధ్యక్షుడు శివకుమార్, జిల్లా కృషిక్ సమాజ అధ్యక్షుడు వడగూరు నాగరాజ్, జెడ్పీ సీఈఓ డాక్టర్ ప్రవీణ్, డిప్యూటీ కలెక్టర్ మంగళ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment