● కేబినెట్ భేటీలో చర్చ
బనశంకరి: నగరంలో హెచ్‌ఎంటీ ఆధీనంలోని అటవీ భూమిని వెనక్కి తీసుకోవడం గురించి క్యాబినెట్‌లో చర్చించినట్లు మంత్రి హెచ్‌కే.పాటిల్ తెలిపారు. గురువారం మంత్రిమండలి సమావేశం జరిగింది, తరువాత వివరాలను మంత్రి వెల్లడించారు. హెచ్‌ఎంటీ సంస్థ సుమారు 160 ఎకరాల భూమిని రూ.375 కోట్లకు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు విక్రయించింది. ఇందుకు అటవీశాఖ అనుమతి తీసుకోలేదు. మరో 180 ఎకరాల అటవీభూమిని అమ్మడానికి సిద్ధమైంది, అటవీభూమిని డీ నోటిఫై చేయలేదు. డీనోటిఫై చేస్తే రాష్ట్రానికి చాలా ఆర్థిక నష్టం ఏర్పడుతుందని తెలిపారు. హెచ్‌ఎంటీకి అటవీ భూమిని ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదు, అందుకే వెనక్కి తీసుకోవడం గురించి క్యాబినెట్‌లో చర్చించామన్నారు. అలాగే ప్యాలెస్ మైదానాన్ని స్వాధీనం చేసుకున్న 1997 యాక్ట్ గురించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీల్ గురించి చర్చించారు. గ్రామ పాలనాధికారులకు రూ.20 కోట్లతో ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని తీర్మానించారు. రేషన్‌కార్డు దారులకు జిల్లా ఆసుపత్రుల్లో స్కానింగ్ టెస్టులలో ఫీజు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment