శివాజీనగర: అతి త్వరలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుని స్థానానికి ఎన్నికల ప్రక్రియ ఆరంభం కానున్నది. ఈ మేరకు కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎన్నికలాధికారి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. శనివారం బెంగళూరులోని కుమారకృపా అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, బూత్ కమిటీ అధ్యక్ష స్థానం నుంచి రాష్ట్రాధ్యక్షుని వరకూ అంతర్గత ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రాధ్యక్ష స్థానం గురించి గందరగోళం లేదు. అందరూ కలసి చర్చించి ఎంపిక చేస్తామన్నారు. మరోవైపు పదవిలో కొనసాగేందుకు బీ.వై.విజయేంద్ర ప్రయత్నాలు చేస్తున్నారు. యడియూరప్ప, విజయేంద్ర వ్యతిరేక వర్గం ఆ పదవి కోసం పాటుపడుతోంది. లేదా విజయేంద్రను మార్చాలని రమేశ్ జార్కిహొళి, యత్నాళ్, ప్రతాప్‌సింహా వంటివారు కోరుతున్నారు. చౌహాన్ వెంట విజయేంద్ర, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.
రాష్ట్రానికి దండిగా ఇళ్లు ●
ప్రధాని నరేంద్రమోదీ సర్కారు కర్ణాటక వికాసానికి ప్రాధాన్యతను ఇస్తోందని, ఇప్పటికే విడుదల చేసిన నిధులు సద్వినియోగం కావాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. నగరంలో అతిథి గృహంలో పలువురు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. రాష్ట్రానికి అత్యధికంగా నిధులను కేటాయించాం, దానిని ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. ప్రతి పేదవానికి ఇల్లు లభించాలనేది మోదీ సంకల్పం. ప్రధానమంత్రి ఆవాస్ పథకం క్రింద గత సెప్టెంబర్‌లో కర్ణాటకకు 2,57,246 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాం, నిధులను కూడా ఇచ్చామని ఆయన చెప్పారు. మళ్లీ ఇప్పుడు 4,67,580 ఇళ్లను నిర్మించేందుకు ఆమోదించినట్లు చెప్పారు. మంత్రులు చెలువరాయస్వామి, కృష్ణభైరేగౌడ, ప్రియాంక ఖర్గే, ఎంపీ బీవై రాఘవేంద్ర, అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment