పత్తా లేని దోపిడీ ముఠా
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో ఉళ్లాల కోటికార్ సహకార బ్యాంక్‌లో దోపిడికి పాల్పడిన దొంగల కోసం వేట సాగుతోంది. కారులో ఐదు మంది కేరళకు పరారైనట్లు తలపాడి టోల్‌గేటు సీసీ కెమెరాలలో రికార్డు అయింది. కారులో ముందుసీటులో డ్రైవర్ ఒక్కడే ఉండగా అతడు మాస్క్ ధరించాడు. అదే కారులోనే డబ్బులు, బంగారు నగలతో ఐదుమంది రాష్ట్రాన్ని దాటేశారని జిల్లా పోలీసులు అనుమానిస్తున్నారు. వాహనాలను మార్చి మార్చి వెళ్లే అవకాశం ఉంది. దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించి రూ. 12 కోట్లకు పైగా బంగారు నగలు, డబ్బును దోచుకెళ్లడం తీవ్ర సంచలనమైంది. స్పీకర్ యూటీ ఖాదర్ బ్యాంకును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
చుట్టుముట్టిన మహిళలు
మరోవైపు స్థానిక ప్రజలు తమ డబ్బు, బంగారం ఏమైనాయంటూ శనివారం బ్యాంకును చుట్టుముట్టారు. తమ సొత్తును చూపించాలంటూ సిబ్బందితో గొడవపడ్డారు. అయితే దోపిడీ జరిగిందని, ఓపిక పట్టాలని సిబ్బంది నచ్చజెప్పారు. భారీ సంఖ్యలో జనం రావడంతో గొడవ జరిగింది. పోలీసులు చేరుకుని ఖాతాదారులను బయటకు పంపారు. మా బంగారం మాకు వాపస్ ఇవ్వాలని అనేకమంది పట్టుబడ్డారు. పిల్లలను విదేశాలకు పంపడానికి, ఇళ్ల కొనుగోలు కోసం బంగారాన్ని కుదువపెట్టామని కొందరు మహిళలు తెలిపారు. దొంగలు దొరక్కపోతే తమ బంగారం ఎలా ఇస్తారో చెప్పాలని పట్టుబట్టారు.
మంగళూరు సహకార బ్యాంకులో
రూ.12 కోట్ల రాబరీ కేసు...
సొత్తు కోసం ప్రజల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment