ఏ క్షణమైనా ఈడీ పిలుపు?
బనశంకరి: మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) అక్రమ స్థలాల కేటాయింపు కేసులో ఈడీ రూ.300 కోట్ల విలువచేసే 142 స్థలాలను జప్తు చేసిన నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని సీఎం సిద్దరామయ్య కుటుంబానికి ఏ క్షణమైనా నోటీస్ జారీచేయవచ్చని తెలుస్తోంది. సిద్దరామయ్య, భార్య పార్వతి, బావమరిది మల్లికార్జునయ్య, భూమి యజమాని దేవరాజ్ కు పిలుపు రావచ్చని సమాచారం. పార్వతికి ముడాతో పాటు అనేకచోట్ల విలువైన స్థలాలు ఉన్నాయి. ఇందుకు సిద్దరామయ్య రాజకీయ పలుకుబడే కారణమని ఈడీ భావిస్తోంది. ఆమె సోదరుడు మల్లికార్జున, భూయజమాని దేవరాజ్‌ను ఈడీ అధికారులు ఒకసారి విచారించారు. సరైన సమాధానం రాకపోవడంతో మరోసారి నలుగురికి నోటీస్ జారీచేయడానికి ఈడీ సిద్ధమైంది. గతంలో సిద్దరామయ్య, కుటుంబసభ్యులు మైసూరులో లోకాయుక్త విచారణకు హాజరయ్యారు. పార్వతి 14 ముడా ప్లాట్లను వెనక్కి ఇచ్చేశారు. కానీ ఈడీ మాత్రం కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈడీ అటాచ్ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ నేతలు గళమెత్తారు. ఈ పరిణామాలతో సిద్దరామయ్య వర్గంలో టెన్షన్ నెలకొంది.
సీఎం సిద్దరామయ్య శిబిరంలో టెన్షన్
Comments
Please login to add a commentAdd a comment