No Headline
బొమ్మనహళ్ళి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలో ఉన్న హెబ్బగోడిలో ఆదివారం రాత్రి కన్నడ సంభ్రమం వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. రవాణా మంత్రి రామలింగారెడ్డి జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ప్రముఖ గాయకురాలు కేఎస్ చిత్ర, ఆమె బృందం సభ్యులు ఆలపించిన గీతాలు మంత్రముగ్ధులను చేశాయి. హెబ్బగోడిలోని ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ మైదానంలో ఈ వేడుకలు జరిగాయి. వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. అనేక కన్నడ భక్తి గీతాలు, హిట్ పాటలను చిత్ర బృందం శ్రావ్యంగా ఆలపించింది. యువత ఉత్సాహంతో చిందులు వేశారు. మొదట చిత్ర వేదికపై వస్తుండగానే చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. రాత్రి 8 గంటలకు మొదలై 3 గంటలపాటు ఏకధాటిగా సాంస్కృతిక వేడుకలు కొనసాగాయి. ఆనేకల్ ఎమ్మెల్యే బీ.శివణ్ణ, కరవే నేత ప్రవీణ్‌శెట్టి తదితరులు హాజరయ్యారు.
చిత్ర గానామృతం
హెబ్బగోడిలో కన్నడ సంభ్రమం వేడుక
మురిపించిన గానాలాపన
Comments
Please login to add a commentAdd a comment