శ్రీరంగపట్టణం బంద్
మండ్య: రైతుల పొలాలు, ప్రభుత్వ స్థలాలు వక్ఫ్ బోర్డు ఆస్తులుగా నమోదై ఉండటాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రైతు, హిందూ సంఘ సంస్థలు సోమవారం మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణం బంద్ నిర్వహించాయి. మెడికల్ షాపులు, తప్ప మిగతా అంగళ్లు, ఆఫీసులు, పాఠశాలలు మూతపడి బంద్ విజయవంతమైంది. ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, బీజేపీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు.
ర్యాలీలు, నిరసనలు
శ్రీరంగ పట్టణ తాలూకా రైతు హితారక్షణ వేదిక పేరుతో వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ధర్నా, ర్యాలీ చేశారు. హిందూ జాగరణ వేదిక, ఆర్‌ఎస్‌ఎస్ రైతు సంఘం, కన్నడ రక్షణ వేదిక, మండ్య రక్షణ వేదిక, కన్నడ సాహిత్య పరిషత్, విళేకరుల సంఘం, న్యాయవాదుల సంఘం, బ్రహ్మణుల సంఘం, సవితా సమాజం , వీధి వ్యాపారుల సంఘం వారు బంద్‌కు మద్దతు ప్రకటించారు. వేలాది మంది రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగళూరు– మైసురు హైవేలో పశువులు నిలిపి వాహనాలను అడ్డుకున్నారు. పంచాయతి ఆఫీసు వద్ద నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో రభస జరిగింది. పలుచోట్ల టైర్లకు నిప్పంటించారు. నిరసనకారులు అక్కడే రైస్‌బాత్‌ను వండి ఆరగించారు.
వక్ఫ్ భూ చట్టంపై జనాగ్రహం
Comments
Please login to add a commentAdd a comment