పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ఖమ్మంవన్‌టౌన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తాజా మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని పంచాయతీరాజ్ చాంబర్ జాతీయ అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ చాంబర్ సమావేశాలు రెండు రోజుల పాటు ఖమ్మంలో నిర్వహించారు. ఈ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి 14 అంశాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. తొలుత జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పుసులూరి నరేందర్, ఉపాధ్యక్షుడిగా చింపుల సత్యనారాయణరెడ్డితో పాటు ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. చట్టబద్ధంగా తమకు ఇవ్వాల్సిన నిధులు, విధులు, అధికారాలను తక్షణమే అందజేయాలని, లేకుంటే ఐక్య సంఘటనగా ఏర్పడి దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment