స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
భద్రాచలం: ఆదివాసీ గిరిజన మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో స్థిరపడి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. దమ్మక్క లయాబిలిటీ గ్రూప్ సభ్యులు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో ఏర్పాటుచేసిన షాపును రాష్ట్ర అటవీ అభివృధ్ది సంస్థ చైర్మన్ పొదెం వీరయ్యతో కలిసి పీఓ ప్రారంభించారు. షాపులో సబ్బులు, షాంపూలు, తేనె, వెదురుతో రూపొందించిన కళాఖండాలను పరిశీలించాక పీఓ మాట్లాడారు. భద్రాచలం క్షేత్రానికి వచ్చే భక్తులకు నాణ్యతమైన వస్తువులు అమ్మడం ద్వారా మంచి పేరు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమాదేవి, జీసీసీ డీఎం సమ్మయ్య, జేడీఎం హరికృష్ణ, మురళి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికాయుతంగా చదివితే లక్ష్యసాధన
విద్యార్థులు ప్రణాళికాయుతంగా చదివితే ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. దుమ్ముగూడెంలోని ఈఎంఆర్‌ఎస్ కళాశాలను తనిఖీ చేసిన ఆయన రికార్డులు, తరగతి గదులను, డైనింగ్ హాల్, వంటశాలలను పరిశీలించాక పదో తరగతి, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడారు. కేవలం చదువుపైనే దృష్టి సారించి క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. అలాగే, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా పియానో కీబోర్డ్, హాకీ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు. గురుకులాల ఆర్‌సీఓ నాగార్జునరావు, కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment