కారేపల్లి: మహిళా శక్తిలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా లింకేజీ రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి సహకరించాలని డీఆర్‌డీఓ సన్యాసయ్య సూచించారు. కారేపల్లిలోని ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఐకేపీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఉపాధి హామీ సెర్ఫ్‌తో అనుసంధానం అయినప్పటికీ పశువులు, కోళ్ల షెడ్లను స్వయం సహాయక సంఘ సభ్యులతో ఏర్పాటుచేయించాలని తెలిపారు. క్రమం తప్పకుండా సంఘాల సమావేశాలు నిర్వహిస్తూ రుణాల మంజూరు, వసూళ్లపై సమీక్షించాలని చెప్పారు. సంఘాలన్నింటినీ ఏ, బీ గ్రేడ్లలో చేర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో ఐకేపీ ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment