యువకుడికి కృత్రిమ చేయి
కారేపల్లి: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎడమ చేయి కోల్పోయిన ఆదివాసీ యువకుడికి దాతల చేయూతతో కృత్రిమ చేయి ఏర్పాటు చేయించారు. కారేపల్లి మండలం టేకులగూడెంకు చెందిన గోగ్గెల మహేందర్ ఏడాది క్రితం విద్యుత్ షాక్‌తో చేయి కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆదివాసీ నాయకుడైన గుమ్మడి సందీప్ గతంలో కారేపల్లిలో ఎస్‌ఐగా పనిచేసిన పుష్పాల రామారావు దృష్టికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఖమ్మం టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐగా ఉన్న రామారావు జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ బాధ్యుల దృష్టికి తీసుకెళ్లగా ఈనాలి ఫౌండేషన్ సహకారంతో ఈనెల 16న హైదరాబాద్‌లో మహేందర్‌కు అధునాతన ప్రొస్తేటిక్ హ్యాండ్(కృత్రిమ చేయి) అందజేశారు. బ్యాటరీ చార్జింగ్‌తో పనిచేసే ఈ చేయితో అన్ని పనులు చేసుకోవచ్చని రామారావు తెలిపారు. ఈసందర్భంగా ఎస్సైతో పాటు క్యాంపు కోఆర్డినేటర్ శ్రీదేవికి మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment