సైలో బంకర్ కాలుష్యం కాటేసింది..
సత్తుపల్లి: ‘సైలో బంకర్ నుంచి వెలువడుతున్న కాలుష్యం మా ప్రాణాలను తోడేస్తుంది.. ఇంటా, బయట ఉండలేకున్నాం.. నా గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి.. నేను బతకలేను..’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న వ్యక్తి అనుకున్నట్లుగా మృత్యువాత పడ్డాడు. సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్‌నగర్‌కు చెందిన బుర్రా తుకారం(38) ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గ్రామసమీపంలోని సైలోబంకర్ నుంచి వస్తున్న కాలుష్యమే తాను అనారోగ్యానికి గురయ్యానంటూ తీసిన సెల్ఫీ వీడియో కొద్దిరోజుల క్రితం వైరల్‌గా మారింది. ఈనేపథ్యాన రెండు రోజుల క్రితం ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా, సైలో బంకర్ నుంచి వెలువడే కాలుష్యంతో తమకు ముప్పు ఉంందని చెబుతున్నా పట్టించుకోవడం లేదంటూ అంబేద్కర్‌నగర్ వాసులు శుక్రవారం తుకారం మృతదేహంతో కిష్టారం–ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అయితే, గ్రామపెద్దలు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అనారోగ్యంతో వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment