ప్రజా సమస్యలపై పోరాడాలి
ఖమ్మంమయూరిసెంటర్: బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పాలకవర్గ సమావేశాల్లో పాల్గొంటూ ప్రజా సమస్యలపై నిలదీయాలని.. మెరుగైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నగర అభివృద్ధికి కృషి చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన కేఎంసీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నేతలతో సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ ప్లోర్ లీడర్‌గా కర్నాటి కృష్ణ, డిప్యూటీ ప్లోర్ లీడర్‌గా షేక్ మక్బూల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుని సన్మానించారు. అనంతరం పువ్వాడ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ప్రజల సమస్యలపై పోరాడాలని సూచించారు. కేసులకు బెదరకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలపై నిలదీయాలని, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ మాట్లాడుతూ కేఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించక ఆరు నెలలు దాటడంతో సమస్యలు పేరుకుపోయాయని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు గుండాల కృష్ణ, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
కార్పొరేటర్ల సమావేశంలో పువ్వాడ
Comments
Please login to add a commentAdd a comment