పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. మొత్తం 726 మంది కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.25,030, 300 మంది బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్‌కు రూ.18,600 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఒకరోజు ఆదాయం రూ.43,630
Comments
Please login to add a commentAdd a comment