ఖమ్మంసహకారనగర్: జిల్లాలోని పర్యాటక ప్రాంతా ల చరిత్ర, ప్రత్యేకతలు ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన క్యాంపు కార్యాలయంలో పురావస్తు, పర్యాటక శాఖ అధికారులతో సమీక్షించారు. నేలకొండపల్లిలోని బౌద్ధస్తూపం, పాలేరు రిజర్వాయర్, ఖమ్మం ఖిల్లా వద్ద అభివృద్ధి పనులు చేపట్టే క్రమాన సిమెంట్ కాకుండా ప్రత్యామ్నాయ సామగ్రి ఉపయోగించాలని తెలిపారు. బౌద్ధస్తూపం వద్ద ఓపెన్ ఎయిర్ మ్యూజియం, వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. అలాగే, పాలేరు రిజర్వాయర్, పార్క్‌ల వద్ద టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణం చేపట్టి బోటింగ్ అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ఖిల్లా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలని, రోప్‌వే నిర్మాణానికి అడ్డంకులను అధిగమించాలని సూచించారు. ఈ సమావేశంలో ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, ఆర్కిటెక్చర్ వి.సత్యశ్రీనివాస్, సీనియర్ ఇంజనీర్ వెంకటేష్, టూరిజం శాఖ డీఈలు ఎన్.రామకష్ణ, ఎం.వీ.శ్రీధర్, పురావస్తు శాఖ ఏడీలు బి.మల్లునాయక్, ఎన్.నర్సింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment