![సుబాబుల్ వాహనాలతో సమస్యలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06wra45-191066_mr-1738866961-0.jpg.webp?itok=9aHPE6Cu)
సుబాబుల్ వాహనాలతో సమస్యలు
ఏన్కూరు: ఆయిల్‌పసామ్, సుబాబుల్ లోడ్లతో వెళ్తున్న వాహనాలతో విద్యుత్ తీగలు తెగి తరచూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని పలువురు ఫిర్యాదు చేశారు. ఏన్కూరులోని సబ్‌స్టేషన్‌లో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్‌పర్సన్ ఎన్.వీ.వేణుగోపాలచారి పాల్గొనగా ఏన్కూరు, తల్లాడ మండల వాసులు పలువురు వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. ఇళ్ల పైనుండి వెళ్తున్న తీగలతో సమస్యలు, లో ఓల్టేజీ కారణంగా ఇబ్బందులపై ఫిర్యాదు చేయగా పరిష్కారంపై ఉద్యోగులకు చైర్‌పర్సన్ సూచనలు చేశారు. ఈ సదస్సులో ఫోరం సభ్యులు కె.రమేష్, ఆర్.చరణ్‌దాస్, ఎస్‌ఏఓ శ్రీదర్, ఏడీఈ సతీష్, ఏఏఓలు సీతారాంగోపాల్, ఏఈలు ఉమాకాంత్, ప్రసాద్, కృష్ణకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment