ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో అటెండర్‌ను అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ విభాగంలోని డీబీ సెక్షన్‌కు సంబంధించి కొన్ని ఫైళ్లు కనిపించడం లేదని ఇటీవల గుర్తించారు. ఓ వర్క్ ఇన్‌స్పెక్టర్ ఫైళ్లను బయటకు తెప్పించినట్లు తెలియగా, అందుకు అటెండర్ రాజేశ్వరి కారణమంటూ సస్పెండ్ చేసినట్లు సమాచారం. అలాగే, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌పై చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో కేఎంసీలో విధులు నిర్వర్తించే ఓ బిల్ కలెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు, మరో బిల్ కలెక్టర్‌ను క్షేత్ర స్థాయిలో పన్నుల వసూళ్లకు పంపించినట్లు సమాచారం.
మేం సీనియర్లం...
కేఎంసీలో కొందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది తీరుతో ఇటీవల విధుల్లో చేరిన వార్డ్ ఆఫీసర్లు ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. వార్డు ఆఫీసర్లతో కొందరు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అమర్యాదగా వ్యవహరిస్తుండడం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా అడ్డుపడుతున్నారని సమాచారం. ఇటీవల ఓ మహిళ ఉద్యోగితో ఔట్ సోర్సింగ్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు మందలించినట్లు తెలిసింది. ఇదంతా కమిషనర్ దృష్టికి వెళ్లకుండా ఓ ఉద్యోగి అడ్డుపడుతున్నాడని ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment