![వందేళ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06spl22-191075_mr-1738866959-0.jpg.webp?itok=iK78l_zv)
వందేళ్ల ఆలయంలో నేడు పునఃప్రతిష్ఠాపన
సత్తుపల్లిటౌన్: కోటప్పకొండ రాళ్లు, మైలవరం నుంచి తెప్పించిన ధ్వజస్తంభం, తమిళనాడులోని కుంభకోణంలో రూపొందించిన ఉత్సవ విగ్రహాలు, మహాబలిపురంలో చేయించిన శ్రీ సీతారాముల విగ్రహాలతో సత్తుపల్లిలోని అయ్యగారిపేట రామాలయం కొత్తశోభ సంతరించుకోనుంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఇటీవల పునర్నిర్మించారు. ఆలయ నిర్వహణకు పూర్వీకులు ఇచ్చిన భూమిని అమ్మగా వచ్చిన నగదుతో పాటు స్థానికుల విరాళాలు కలిపి మొత్తంగా రూ.1.20కోట్లు వెచ్చించారు. ఈ ఆలయంలో శుక్రవారం విగ్రహాల ప్రతిష్ఠాపనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ బాధ్యులు చల్లగుండ్ల కృష్ణయ్య, నాగళ్ల ప్రసాద్, బొంతు చంద్రశేఖర్ తెలిపారు.
రూ.1.20 కోట్లతో శ్రీసీతారాముల ఆలయ నిర్మాణం
![వందేళ్ల ఆలయంలో నేడు పునఃప్రతిష్ఠాపన1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06spl21-191075_mr-1738866959-1.jpg)
వందేళ్ల ఆలయంలో నేడు పునఃప్రతిష్ఠాపన
Comments
Please login to add a commentAdd a comment