మృతి చెందిన మూడు నెలలకు గుర్తింపు
నేలకొండపల్లి: ఇంటి నుంచి తప్పిపోయిన మహిళ కోసం మూడు నెలలుగా గాలిస్తుండడంతో చివరకు ఆమె మృతి చెందిందని, గుర్తు తెలియని మృతదేహంగా భావించి అంత్యక్రియలు కూడా పూర్తిచేశారని తెలియడంతో ఆమె కుటుంబీకులు కన్నీరుమున్నీరైన ఘటన ఇది. నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం ఉప్పలపహాడ్‌కు చెందిన కుక్కమూడి కిష్టమ్మ(70) గత ఏడాది నవంబర్ 27న వేములవాడలోని బంధువుల ఇంటికి ఒంటరిగా వెళ్తూ ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడి గల్లంతైనట్లు సమాచారం. ఆ తర్వాత డిసెంబర్ 17న కూసుమంచి మండలంలోని కాల్వలో వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించినా అప్పటికే గుర్తు పట్టలేని స్థితిలో ఉండడంతో మార్చురీలో భద్రపరిచారు. పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఆచూకీ కోసం యత్నించినప్పటికీ వివరాలు తెలియకపోవడంతో డిసెంబర్ 25న మృతదేహానికి అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో అంత్యక్రియలు పూర్తిచేయించారు. అనంతరం వాట్సప్‌లో ఓ గ్రూప్ నుంచి మరో గ్రూప్‌కు ఫొటోలు షేర్ చేస్తుండడం.. కిష్టమ్మ కుటుంబీకులు ఆరా తీస్తుండడంతో విష యం బయటపడింది. దీంతో నేలకొండపల్లి పోలీ సులను గురువారం ఆశ్రయించగా అంత్యక్రియలు పూర్తయినట్లు చెప్పడంతో శ్మశాన వాటికలో నివాళులర్పించి భారమైన హృదయంతో వెనుదిరిగారు.
సమాధి వద్ద కన్నీరుమున్నీరైన కుటుంబీకులు
Comments
Please login to add a commentAdd a comment