గురుకుల విద్యార్థుల ప్రతిభ
సిర్పూర్(టి): పదో జోనల్‌స్థాయి క్రీడా పోటీల్లో సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను గురువారం గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్, డీసీవో శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. ములుగు జిల్లాలో ఈ నెల 11 నుంచి 14 వరకు నిర్వహించిన పదో జోనల్‌స్థాయి క్రీడాపోటీల్లో అండర్– 14 విభాగం కబడ్డీలో ద్వితీయ బ హుమతి, అండర్– 17 బాల్‌బ్యాడ్మింటన్‌లో ప్రథ మ బహుమతి, అండర్– 17 ఫుట్‌బాల్‌లో ద్వితీయ బహుమతి, అండర్– 19 టెన్నికాయిట్‌లో ద్వితీయ బహుమతి, అలాగే అథ్లెటిక్స్ విభాగంలో అండర్– 14 డిస్కస్ త్రోలో ప్రథమ బహుమతి, అండర్–17 విభాగం 100 మీటర్స్‌లో ప్రథమ, తృతీయ బహుమతి, 200మీ.లో ప్రథమ, ద్వితీయ బహుమతులు, 400మీ.లో ప్రథమ బహుమతి, 5000 మీ.లో తృతీయ బహుమతి, లాంగ్‌జంప్‌లో ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించినట్లు తెలిపారు.
బాలికల సత్తా
మంచిర్యాల జిల్లాలో ఈ నెల 11 నుంచి 14 వరకు నిర్వహించిన పదో జోనల్ స్థాయి క్రీడాపోటీల్లో సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ బాలి కల గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థినులు కూడా సత్తా చాటారు. అండర్– 14 రన్నింగ్ 100, 200 మీటర్లలో ప్రథమ బహుమతి, టెన్ని కాయిట్, ఖోఖో, క్యారం బోర్డు పోటీల్లో ద్వితీ య బహుమతి, అండర్– 17 విభాగం డిస్కస్ త్రోలో ప్రథమ బహుమతి, లాంగ్‌జంప్, బాల్‌బ్యాడ్మింటన్‌లో ద్వితీయ బహుమతి, 100, 200 మీ. షాట్‌ఫుట్‌లో తృతీయ బహుమతి, అండర్ – 19 టెన్నికాయిట్, ఖోఖోలో ప్రథమ బహుమ తి, చెస్‌లో ద్వితీయ బహుమతి, అథ్లెటిక్స్‌లో అండర్– 17, 19లో చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారని ప్రిన్సిపాల్ శారద తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment