కుటుంబ సర్వే వేగంగా పూర్తిచేయాలి
● డీపీవో భిక్షపతి
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి అన్నారు. మండలంలోని నారాయణపూర్లో సమగ్ర కుటుంబ సర్వేను గురువారం తనిఖీ చేశారు. ఎన్యుమరేటర్లు నమోదు చేస్తున్న కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత గడువులోగా సర్వే పూర్తిచేయాలన్నారు. బ్లాకుల వారీగా గుర్తించిన ఇళ్లకు వెళ్లి సమాచారం సేకరించాలని సూచించారు. వివరాల నమోదులో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఎన్యుమరేటర్లు సమన్వయంతో పనిచేసి వందశాతం సర్వే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment