గ్రూప్– 2 నమూనా పరీక్షలకు దరఖాస్తులు
ఆసిఫాబాద్రూరల్: తెలంగాణ పబ్లిక్ కమిష న్ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు గ్రూప్– 2 నమూనా పరీక్షలకు జిల్లాలోని ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ వర్గాలకు చెందిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల వా రు ఈ నెల 29లోగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల మైనార్టీ కార్యాలయంలో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 2, 3, 9, 10 తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 85007 23745 నంబర్లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment