సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
● అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ ● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ ఎం.డేవి డ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఒంటరి మహిళ పింఛన్ ఇప్పించాలని బెజ్జూర్ మండలం మర్తిడికి చెందిన గుండ్ల యశోద దరఖాస్తు చేసుకుంది. తన కుమార్తెకు మతిస్థిమితం లేదని, ఆసరా పింఛన్ మంజూరు చేయాలని వాంకి డి మండలం లెండిగూడకు చెందిన నాగోష శ్యాంరావు విన్నవించారు. ఇందిరమ్మ ఇల్లు అందించాలని, గృహజ్యోతి పథకం వర్తింపజేయాలని జిల్లా కేంద్రంలోని బజార్‌వాడికి చెందిన జంజిరాల ప్రమీల కోరింది. ఉపాధి చూపాలని కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామ పంచాయతీలోని పర్దాన్‌గూడకు చెందిన ఎం.విజయ్ వేడుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటున్న తనకు కొత్త పట్టా పాస్‌బుక్ జారీ చేయాలని వాంకిడి మండలం మహాగావ్‌కు చెందిన మడావి చిన్నమారు అర్జీ సమర్పించాడు. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని సిర్పూర్– టి మండలం పారిగాంకు చెందిన దందిరే రావూజీ దరఖాస్తు చేసుకున్నాడు. ట్రై సైకిల్ ఇవ్వాలని రెబ్బెన మండలానికి చెందిన ది వ్యాంగుడు శంకర్‌లాల్ జైశ్వాల్ కోరాడు. కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎడమ కాల్వకు గండి
రెబ్బెన మండలంలోని గోలేటి రిజర్వాయర్ ఎడమ కాల్వకు మూడేళ్ల క్రితం 150 అడుగుల పొడవు గండి పడింది. రిజర్వాయర్ కింద 220 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. గండి పడడంతో ఇప్పటివరకు ఐదు పంటలు నష్టపోయాం. కాల్వకు మరమ్మతు చేయించి సాగు నీరందించాలి.
– కృష్ణప్రసాద్, ఆయకట్టు రైతు
Comments
Please login to add a commentAdd a comment