శాంతి భద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వద్దు
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
ఆసిఫాబాద్‌అర్బన్: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, నేరాల కట్టడికి సమష్టిగా శ్రమించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా డీఎస్పీ కరుణాకర్ పూలమొక్కతో స్వాగతం పలికారు. కార్యాలయంలోని రికార్డులను ఎస్పీ పరిశీలించారు. అనంతరం కేసుల వివరాలు, నిందితుల అరెస్టు, దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. చట్టాలను అతిక్రమించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ఓపికతో ఫిర్యాదులు పరిష్కరించాలని సూచించారు. నేరాల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్, వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐలు రవీందర్, స్వామి, సత్యనారాయణ, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment