నాగోబా జాతర ఏర్పాట్లు ముమ్మరం
ఇంద్రవెల్లి: ఈ నెల 28న నాగోబా జాతర షురూ కానుంది. ఇప్పటికే మెస్రం వంశీయుల గంగాజల సేకరణ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గోవడ్, కోనేరుకు రంగులు వేయడంతో పాటు మర్రిచెట్టు, జాతర నిర్వహణ స్థలం వద్ద పిచ్చిమొక్కల తొలగించే పనులు పూర్తి చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మెస్రం వంశీయులు బస చేయనున్న మర్రిచెట్టు తదితర ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. శాశ్వతంగా నిర్మించిన మరుగుదొడ్లు, స్నానపు గదుల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు గల రహదారికి ఇరువైపులా కోతకు గురైన ప్రాంతాల్లో మొరం పోసి బాగు చేశారు. అలాగే నాగోబా ఆలయ సమీపంలో హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. జాతర ప్రారంభానికి వారం ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు.
బ్లేడ్ ట్రాక్టర్‌తో పిచ్చి మొక్కలు తొలగిస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment