● గణతంత్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం ● ఉమ్మడి జిల్లా నుంచి పది మంది ఎంపిక
ఉట్నూర్‌రూరల్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26న ఢిల్లీలో నిర్వహించనున్న వేడుకల్లో పాల్గొనేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పది మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రంగాల్లో వారు చేసిన కృషితో పాటు రూరల్ డెవలప్‌మెంట్, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిపై హ్యాండిక్రాప్ట్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్‌కు చెందిన జాడే సుజాత, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని కౌఠి గ్రామానికి చెందిన ఎస్.జయంతి రాణి ఎంపికయ్యారు. రూరల్ డెవలప్‌మెంట్ విభాగం నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని కుకుడ గ్రామానికి చెందిన పోర్తెట్టి శ్రీదేవి, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెరకు చెందిన మెస్రం లలిత ఎంపికయ్యారు. పీఎం జన్‌మన్ విభాగం నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాలకు చెందిన ఆత్రం రాంబాయి, సిడాం భీంరావు, ఉట్నూర్ మండలంలోని ధర్మాజీపేటకు చెందిన కొడప లక్ష్మీబాయి, అయ్యు, మడావి రాంబాయి, మానిక్‌రావు ఎంపికయ్యారు. ఈ నెల 26న కర్తవ్యపథలో జరిగే గణతంత్ర వేడుకలను వీక్షించేందుకు వీరంతా ఢిల్లీ వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment