ఆదిలాబాద్‌టౌన్: ఈ నెల 10న అదృశ్యమైన పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన బోంపల్లి నరేందర్ (30) మృతదేహం సోమవారం లభ్యమైనట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 9న ఇంటి నుంచి బయలుదేరిన నరేందర్ ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ ప్రాంతంలో అతని తండ్రికి కనిపించాడు. మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో టూటౌన్‌లో ఫిర్యాదు చేశారు. జైనథ్ మండలంలోని పెన్‌గంగలో శవమై తేలినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
కుక్కల దాడిలో గొర్రె మృతి
బోథ్: మండలంలోని ధన్నూర్(బి)లో షేక్ పెద్ద మోహినుద్దీన్‌కు చెందిన గొర్రైపె సోమవారం కుక్కలు దాడి చేయడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గొర్రె విలువ రూ.12 వేల వరకు ఉంటుందని, తనకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment