‘ఏప్రిల్ 1 నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆన్‌లైన్’
రెబ్బెన(ఆసిఫాబాద్): ఏప్రిల్ 1 నుంచి సింగరేణి వ్యాప్తంగా అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో బుధవారం ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటివరకు ఉత్తర, ప్రత్యుత్తరాలు, సర్క్యూలర్లు కాగితాలపైనే జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ ద్వారా కొనసాగుతాయని తెలిపారు. సమాచారం మొత్తం ఆన్‌లైన్‌లో భద్రంగా ఉంటుందన్నారు. పేపర్‌లెస్ విధానంపై ఐటీ విభాగం అధిపతి ముజీబ్ అవగాహన కల్పించారు. ఎస్‌వోటూజీఎం రాజమల్లు, ప్రాజెక్టు అధికారి నరేందర్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment