క్రీడాభివృద్ధికి కృషి
బెజ్జూర్(సిర్పూర్): క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నా రు. మండలంలోని కుంటలమానెపల్లి గ్రా మంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కుమురంభీం స్మారక కబడ్డీ, వాలీబాల్ పోటీలు బుధవారం ముగిశాయి. ఆయన మాట్లాడుతూ బెజ్జూర్ మండలంలో ప్రభుత్వ స్థలా న్ని గుర్తించి క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దుతామన్నారు. కబడ్డీ పోటీల్లో గెలుపొందిన అందవెల్లి జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన కమ్మర్గాం జట్లకు బహుమతులు ప్రదానం చేశా రు. మాజీ ఎంపీపీ మనోహర్‌గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ బాపు, నాయకులు వెంకటేశ్, వసీఉల్లా ఖాన్, రాకేశ్, విజయ్, తుకారాం, రాజారాం, దిగంబర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment