పదోన్నతితో మరిన్ని బాధ్యతలు
ఆసిఫాబాద్‌అర్బన్: పదోన్నతి ద్వారా ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో ఏఎస్సైలుగా పనిచేస్తూ ఎస్సైలుగా పదోన్నతి పొందిన వారిని గురువారం జిల్లా కేంద్రంలో పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎస్సైలుగా పదోన్నతి పొందిన అధికారులు క్రమశిక్షణతో మెలుగుతూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రజల మన్ననలు పొందుతూ పోలీసుశాఖపై నమ్మకం పెరిగే విధంగా కృషి చేయాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ఎస్సైలుగా పదోన్నతి పొందిన జాడె శ్యాంరావు(వాంకిడి), లక్ష్మణ్(రెబ్బెన), యాదగిరి (సిర్పూర్ టౌన్) ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment